జూన్‌లో 12 రోజులు బ్యాంకులకు సెలవులు..
- May 26, 2025
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) జూన్ కు సంబంధించి బ్యాంకు హాలిడేస్ జాబితాను ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు బ్యాంకులకు 12 రోజుల సెలవులను ప్రకటించింది. నెల మొత్తంలో 12 రోజులు బ్యాంకు సెలవులు ఉంటాయి.
అందులో వారాంతపు సెలవులు అన్ని ఆదివారాలు, రెండో, నాల్గవ శనివారాలు ఉన్నాయి. పండుగల సమయంలో మరో 6 రోజులు బ్యాంకులు మూతపడతాయి. ఈ సెలవుల్లో బ్యాంకుల్లో ఎలాంటి లావాదేవీలు జరగవు.
వచ్చే నెలలో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ముందుగానే ఆయా బ్యాంకు పనులను పూర్తి చేసుకోవడం మంచిది. ఇంతకీ ఏయే తేదీల్లో బ్యాంకులు పనిచేయవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
జూన్ 2025 లో బ్యాంకులకు సెలవుదినాలివే:
పబ్లిక్ హాలిడేస్:
జూన్ 6 (శుక్రవారం) : ఈద్-ఉల్-అధా (బక్రీద్) : అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
జూన్ 7 (శనివారం) : బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) : బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై వంటి ప్రధాన నగరాలతో సహా దేశంలోని చాలా ప్రాంతాలలో బ్యాంకులు పనిచేయవు.
జూన్ 11 (బుధవారం) : సంత్ గురు కబీర్ జయంతి : సిక్కిం, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు పనిచేయవు.
జూన్ 27 (శుక్రవారం) : రథయాత్ర : ఒడిశా, మణిపూర్‌లలో బ్యాంకులు పనిచేయవు.
జూన్ 30 (సోమవారం) : రెమ్నా ని : మిజోరంలో బ్యాంకులు పనిచేయవు.
వారాంతపు సెలవులు:
జూన్ 1 (ఆదివారం)
జూన్ 8 (ఆదివారం)
జూన్ 14 ( రెండో శనివారం)
జూన్ 15 (ఆదివారం)
జూన్ 22 (ఆదివారం)
జూన్ 28 (నాల్గో శనివారం)
జూన్ 29 (ఆదివారం)
యధావిధిగా డిజిటల్ బ్యాంకింగ్ సేవలు:
బ్యాంకు సెలవుల్లో నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్, యూపీఐ, వ్యాలెట్, ఏటీఎం వంటి డిజిటల్ సర్వీసులు పనిచేస్తాయి. ఆన్‌లైన్‌లో నగదు లావాదేవీలు చేయవచ్చు. చెక్కు డిపాజిట్, డ్రాఫ్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది.
ఈ పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలి. మీ ప్రాంతంలోని బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించి సెలవులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







