కువైట్‌లో 360 మాల్ సమీపంలో రోడ్ మూసివేత..!!

- November 24, 2026 , by Maagulf
కువైట్‌లో 360 మాల్ సమీపంలో రోడ్ మూసివేత..!!

కువైట్: కువైట్‌లోని సిక్స్త్ రింగ్ రోడ్డుపై 360 మాల్ సమీపంలో ఉన్న సమాంతర ఎగ్జిట్‌ను విస్తరణ పనుల కోసం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రజాపనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జాసిమ్ మొహమ్మద్ అల్ ఖరాఫీ రోడ్డులోని (Sixth Ring Road) అల్ జహ్రా, 360 మాల్ ఎదురుగా ఉన్న ఈ ఎగ్జిట్‌ను మూసివేశారు. రహదారి విస్తరణ పనుల కారణంగా ఈ ఆంక్షలు డిసెంబర్ 21 వరకు కొనసాగనున్నాయి.

పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ, జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ సమన్వయంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం మంత్రిత్వ శాఖ హాట్‌లైన్ 150కు ఫోన్ చేయవచ్చు. లేదా అధికారిక వెబ్‌సైట్ www.mpw.gov.kw ను సందర్శించవచ్చని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com