ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేతులు కలిపిన కువైట్, భారత్..!!
- May 27, 2025
కువైట్: భారత ఎంపీ బైజయంత్ జే పాండా నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం సోమవారం కువైట్ ఉప ప్రధానమంత్రి, క్యాబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి షెరిడా అబ్దుల్లా సాద్ అల్-మౌషర్జీని కలిసి, సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం తీసుకున్న ఇటీవలి చర్యల గురించి ఆయనకు వివరించింది. ఉగ్రవాదం పట్ల తమ జీరో-టాలరెన్స్ విధానాన్ని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. "భారతదేశం , కువైట్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా ఉమ్మడి నిబద్ధతలో ఐక్యంగా ఉన్నాయి. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం తీసుకున్న ఇటీవలి చర్యల గురించి వివరించడానికి, మా ఉమ్మడి జీరో-టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటించడానికి మా అఖిలపక్ష ప్రతినిధి బృందం.. కువైట్ ఉప ప్రధాన మంత్రి , క్యాబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీమతి షెరిడా అబ్దుల్లా సాద్ అల్ మౌషర్జీతో సమావేశం అయింది." అని పాండా Xలో పోస్ట్ లో వివరించారు.
బైజయంత్ జే పాండా నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందంలో బిజెపి ఎంపి నిషికాంత్ దుబే, బిజెపి ఎంపి ఫంగ్నోన్ కోన్యాక్, బిజెపి ఎంపి రేఖ శర్మ, ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఎంపి అసదుద్దీన్ ఒవైసీ, బిజెపి ఎంపి సత్నామ్ సింగ్ సంధు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, మాజీ భారత దౌత్యవేత్త హర్ష్ ష్రింగ్లా ఉన్నారు.
అనంతరం ప్రతినిధి బృందం కువైట్లోని అతిపెద్ద మసీదు అయిన కువైట్లోని ఐకానిక్ గ్రాండ్ మసీదును సందర్శించింది. భారత రాయబార కార్యాలయం ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఈ బృందం పుష్పగుచ్ఛాలు పెట్టి నివాళులు అర్పించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!







