యూఏఈలో కనీస బ్యాంక్ బ్యాలెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు..!!
- May 28, 2025
యూఏఈ: రిటైల్ కస్టమర్లకు కనీస బ్యాలెన్స్ అవసరాన్ని దిర్హామ్స్ 3,000 నుండి దిర్హామ్స్ 5,000 కు పెంచవద్దని యుఎఇ సెంట్రల్ బ్యాంక్ బ్యాంకులను కోరింది. ఈ మేరకు అన్ని లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థలకు (LFIలు) రెగ్యులేటర్ నోటీసు పంపింది. కనీస బ్యాలెన్స్ మొత్తాన్ని Dh3,000 నుండి Dh5,000కి పెంచడాన్ని వాయిదా వేయాలని అందులో సూచించింది.
గత వారం, అనేక బ్యాంకులు కనీస బ్యాలెన్స్ అవసరాన్ని 5,000 దిర్హామ్‌లకు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇది సెంట్రల్ బ్యాంక్ వ్యక్తిగత రుణ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన ప్రస్తుత దిర్హామ్‌లు 3,000 పరిమితి యధాతథంగా కొనసాగనుంది.
సెంట్రల్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం, బ్యాంకుల డిపాజిట్లు జనవరి 2025 చివరి నాటికి Dh2.840 ట్రిలియన్ల నుండి ఫిబ్రవరి 2025 చివరి నాటికి Dh2.874 ట్రిలియన్లకు 1.2 శాతం పెరిగాయి. నివాసితుల డిపాజిట్లలో 0.8 శాతం పెరుగుదలతో Dh2.625 ట్రిలియన్లకు మరియు నాన్-రెసిడెంట్ డిపాజిట్లలో 5.1 శాతం పెరుగుదల, Dh249.1 బిలియన్లకు చేరుకోవడం వల్ల బ్యాంక్ డిపాజిట్లలో పెరుగుదల కనిపించిందని తెలిపారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







