అరెస్టైన ఐఎస్ఐఎస్ సానుభూతిపరులనుండి కీలక విషయాలు రాబట్టిన ఎన్ఐఏ

- July 11, 2016 , by Maagulf
అరెస్టైన ఐఎస్ఐఎస్ సానుభూతిపరులనుండి కీలక విషయాలు రాబట్టిన ఎన్ఐఏ

ఐసిస్‌ సానుభూతిపరులను సోమవారం విచారించిన కేంద్ర దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) వారినుంచి కీలక విషయాలు రాబట్టింది. ఇటీవలి హైదరాబాద్‌లో విధ్వంసానికి విఫలయత్నం చేసి పోలీసులకు చిక్కిన ఐసిస్‌ సానుభూతిపరులను ఎన్‌ఐఏ తన కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. చార్మినార్‌ వద్ద సహద్‌ 9 ఎయిర్‌సెల్‌ ప్రి యాక్టివేటెడ్‌ సిమ్‌ కార్డులు, ఐదు చైనా ఫోన్‌లను కొన్నట్లు అధికారులు నిర్థరించారు. పేలుడు పదార్థాలను తూకం వేసేందుకు బరువు తూచే యంత్రాన్ని ఇలియాస్‌ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. మిగిలిన ఉగ్రవాదులతో సంప్రదింపులు జరిపేందుకు ఇక్బాల్‌ ఎన్‌క్రిప్ట్‌ మెయిల్‌ను ఇక్బాల్‌ వాడినట్లు, టుటనోటా.కామ్‌ మెయిల్‌తో ఉగ్రవాదులతో చర్చించినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com