ఇన్నోప్రోమ్-2016వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు
- July 11, 2016
సహజవనరుల వినియోగం, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో అగ్రభాగాన ఉన్న రష్యాతో ఆంధ్రప్రదేశ్ కలసి పనిచేయాలన్న దృఢసంకల్పంతో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కజకిస్థాన్, రష్యాపర్యటనలో మూడోరోజు ఆయన రష్యాలోని ఎకటెరిన్‌బర్గ్‌లో ఇన్నోప్రోమ్-2016 వేదికపై నుంచి కీలకోపన్యాసం చేశారు. రష్యా,భారత్‌లకు దశాబ్దాల బంధం ఉందని, ఉభయదేశాలు సహజమిత్రులని ఆయన అభివర్ణించారు.
రష్యన్ ఫెడరేషన్ పరిశ్రమలు, వాణిజ్యమంత్రి డెనిస్ మాంచురోవ్ మాట్లాడుతూ భారత్ విదేశీ పెట్టుబడులు అనుమతించడాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. పెట్టుబడులు ప్రవహించేలా తీసుకున్న కీలకనిర్ణయంతో భారత్ అభివృద్ధికి మార్గం సుగమం అయిందని చెప్పారు.భారత్, రష్యా సహకార సంబంధాలు పెరిగేందుకు ఈ ఇన్నోప్రోమ్ -2016 వేదికపై సరైన వేదికగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఇన్నోప్రోమ్లో ఏపీ పెవిలియన్
తొలుత రష్యన్ మంత్రి డెనిస్ మాంచురోవ్ ఇన్నోప్రోమ్ ఇండియా పెవిలియన్‌ను ప్రారంభించారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయటంతో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌కు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాంచురోవ్ మాట్లాడుతూ ఏఏ రంగాల్లో ఉభయ దేశాలు పరస్పర సహకారం అందించుకోవచ్చో మనం అన్వేషించాల్సి ఉందని వివరించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర, రాజస్థాన్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, వసుంధర రాజే పాల్గొన్నారు.ఇన్నోప్రోమ్-2016లో భాగస్వామ్య దేశప్రతినిధి, భారత వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ 2025వ సంవత్సరానికి భారత్, రష్యా మధ్య వ్యాపారం 30బిలియన్ డాలర్లమేరకు జరగాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలో చెన్నైలో నిర్వహించే 'ఇండియా ఇంజినీరింగ్ సోర్సింగ్ ఎగ్జిబిషన్'కు రష్యాను ఆహ్వానిస్తున్నాను అని తమ ప్రసంగాన్ని ముగించారు.డెనిస్ మాంచురోవ్తో భేటీ ఆదివారం రాత్రి ఇన్నోప్రోమ్-2016 ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు సోమవారం ఉదయం రష్యన్ ఫెడరేషన్ పరిశ్రమలు, వాణిజ్యమంత్రి డెనిస్ మాంచురోవ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రష్యాఇండియా బిజినెస్ ఫోరాన్ని రష్యన్ బిజినెస్ ఆర్గనైజేషన్ ప్రతినిధి అలెక్సీ రెపిక్ ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







