ఆ హత్యకు డబ్బు కారణం కాదు?
- July 11, 2016
తమిళనాడుకి చెందిన నారాయణన్ ముత్తయ్య అనే వ్యక్తి బహ్రెయిన్‌లో ఇటీవల హత్యకు గురయ్యాడు. ఆ హత్యకు కారణం ఇంతవరకు తెలియరాలేదు. డబ్బు కోసమే హత్య జరిగిందనీ ముందుగా అంతా భావించారు. అయితే హత్యకు గురైన వ్యక్తి నుంచి దుండగుడు డబ్బునుగానీ, మొబైల్ ఫోన్‌గానీ, ఆభరణాలుగానీ తీసుకెళ్ళిపోకపోవడంతో అది డబ్బు కోసం జరిగిన హత్య కాదని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం మత్తయ్యను హత్య చేసింది ఆసియాకి చెందిన వ్యక్తేనని పోలీసులు వెల్లడించారు. తమిళనాడులోని పుదుకొట్టై జిల్లా అనంతగిరికి చెందిన మత్తయ్య 10 ఏళ్ళుగా బహ్రెయిన్‌లో నివాసం ఉంటున్నాడు. మనామాలోని యతీమ్ ఎయిర్ కండిషనింగ్ కంపెనీలో ఫ్యాబ్రికేటర్‌గా పనిచేస్తున్నాడు మత్తయ్య. మృదుస్వభావి అనీ, చాలా మంచివాడని మత్తయ్య గురించి సన్నిహితులు చెప్పారు. పోలీసు విచారణ పూర్తయ్యాక మత్తయ్య మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







