అబుదాబీలో అతి పెద్ద కుడ్య చిత్రం

- July 11, 2016 , by Maagulf
అబుదాబీలో అతి పెద్ద కుడ్య చిత్రం

600 మీటర్ల పొడవైన కుడ్య చిత్రం అబుదాబీలోని అల్‌ రహా బీచ్‌లో ప్రారంభించారు. ఈ పెయింటింగ్‌లో ఎమిరేటీ సంప్రదాయాల్ని అత్యద్భుతంగా పొందుపరిచారు. మినిస్ట్రర్‌ ఆఫ్‌ కల్చర్‌ మరియు నాలెడ్జ్‌ డెవలప్‌మెంట్‌ షేక్‌ నహ్యాన్‌ బిన్‌ ముబారక్‌ అల్‌ నహ్యాన్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ - అల్దార్‌ ప్రాపర్టీస్‌ పిజెఎస్‌సి మొహమ్మద్‌ ఖలీఫా అల్‌ ముబారక్‌ సమక్షంలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఐదు వారాల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. మియామీకి చెందిన చిత్రకారుడు ఇవోకా ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించారు. ఈ గొప్ప చిత్రం అబుదాబీకి సరికొత్త గ్లామర్‌ని అద్దిందని షేక్‌ నహ్యాన్‌ చెప్పారు. యూఏఈలో అతి పెద్ద కుడ్య చిత్రాల్లో ఇది కూడా ఒకటని అల్‌ ముబారక్‌ అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com