కెన్యా బిసినెస్ సమ్మిట్ లో పాల్గొన్న దుబాయ్-తెలంగాణా వ్యాపారావేత్తలు
- July 12, 2016
ప్రధాని నరేంద్ర మోడీ కెన్యా పర్యటన లో తెలంగాణా వ్యాపారవేత్తలకు లభించిన ప్రత్యేక ఆహ్వానం.దుబాయ్ లో నివసిస్తున్న తెలంగాణా వై.శ్రీనివాస్(అల్ కాన్స్ గ్రూప్ అధినేత) మరియు గుండపనేని చక్రధర్ రావు (కాటేనా గ్రూప్ డైరెక్టర్) లు బిసినెస్ సమ్మిట్ లో వివిధ వ్యాపార సంస్థల అధికారులతోను,కెన్యా ప్రభుత్వ అధికారులతోను చర్చించి పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. అల్ కాన్స్ కెన్యా లో సోలార్ స్ట్రీట్ లైట్ ప్రాజెక్ట్స్ మరియు సిసిటివి మరియు ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిస్టమ్ సంబంధ ప్రోజెక్టుల నిర్మాణానికి ఒప్పందాలు చేసుకున్నది .
కాటేనా గ్రూప్ అగ్రికల్టురల్ ప్రోడక్ట్స్ ఎగుమతి దిగుమతులు,స్థానికంగా కెన్యాలో వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నారు.సమ్మిట్ లో భాగంగా ప్రధాని కెన్యా భారత సంబంధాలు 100 సం పై నుండి ఉన్నవని వ్యాపార వాణిజ్య వ్యవహారాలలో ఇరు దేశాల ప్రభుత్వాలు వ్యాపార వేత్తలు భాగస్వామ్యం
తీసుకోవాలని కోరారు.
భారత్ నుండి అన్ని విధాలైన సహాయ సహకారాలు అందిస్తామని 'మేక్ ఇన్ ఇండియా' లాగా మేక్ ఇన్ కెన్యా లో భారత సంతతి కెన్యా లో పాలు పంచుకోవాలని దానికి ఇండియా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించిన సోలార్ మరియు వ్యవసాయ రంగాలలోనే మన తెలంగాణా వ్యాపారవేత్తలు ఒప్పందాలు చేసుకోవడం ప్రశంసనీయం.
తాజా వార్తలు
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!







