సౌదీ అరేబియాలో SR74 బిలియన్లకు పెరిగిన దిగుమతులు..!!
- June 02, 2025
రియాద్: సౌదీ అరేబియా వస్తువుల దిగుమతులు మార్చిలో స్వల్పంగా పెరిగి SR74 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది 2024లో ఇదే కాలంతో పోలిస్తే 0.1 శాతం పెరుగుదల అని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) విడుదల చేసిన డేటా తెలిపింది. వస్తువుల దిగుమతులు సుమారు SR 1.65 బిలియన్లు పెరిగాని, ఇది రెండు శాతానికి సమానమని వెల్లడించింది.
మార్చి నెలలో మొత్తం దిగుమతుల్లో యంత్రాలు, యాంత్రిక పరికరాలు, విద్యుత్ పరికరాలు , వాటి విడిభాగాలు 26 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వీటి విలువ SR19.3 బిలియన్లు. వాహనాలు, విమానాలు, ఓడలు, రవాణా పరికరాలు సుమారు 15 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
మార్చిలో సౌదీ అరేబియా మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 25 శాతం. దీని విలువ 18.7 బిలియన్ సౌదీ రియాల్. ఆ తర్వాతి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ 5.8 బిలియన్ సౌదీ రియాల్, యూఏఈ 4.4 బిలియన్ సౌదీ రియాల్ ఉన్నాయి. మొత్తం దిగుమతుల్లో దాదాపు 65 శాతం వాటా కలిగి ఉన్న టాప్ 10 దేశాలు., ఇది 48.1 బిలియన్ సౌదీ రియాల్ కు సమానంగా ఉన్నాయి.
గృహనిర్మాణం, నీరు, విద్యుత్, గ్యాస్, ఇతర ఇంధనాల పెరుగుదల ఈ వార్షిక ధరల పెరుగుదలకు కారణమని అథారిటీ పేర్కొంది. ఇది అత్యధికంగా 6.8 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఫుడ్, పానీయాల ధరలలో 2.2 శాతం పెరుగుదల.. వివిధ వ్యక్తిగత వస్తువులు, సేవల ధరలలో 3.5 శాతం పెరుగుదల నమోదైంది. అదే సమయంలో ఫర్నిచర్ , గృహోపకరణాల ధరలు 1.8 శాతం తగ్గాయి. కమ్యూనికేషన్ ధరలు 1.5 శాతం తగ్గాయి,. పాదరక్షల ధరలు 1.2 శాతం తగ్గాయి. రవాణా 1.0 శాతం తగ్గింది. ఆరోగ్యం, వినోదం, సంస్కృతి ధరలు కూడా వరుసగా 0.2 శాతం నుంచి 0.7 శాతం తగ్గాయి. దీనికి విరుద్ధంగా పొగాకు రంగం 0.1 శాతం స్వల్ప పెరుగుదలను నమోదు చేసిందని నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







