జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- February 06, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల కోసం ‘తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్-2025’ను అధికారికంగా విడుదల చేసింది.సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) జీవో నెం.252ను జారీ చేస్తూ, కొత్త నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధులు ఫిబ్రవరి 9 నుంచి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
అక్రిడిటేషన్లకు అర్హత
అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి రెండు సంవత్సరాలు ఉండనుంది. అక్రిడిటేషన్లకు అర్హత కోసం దినపత్రికలు కనీసం 2 వేల ప్రతుల సర్క్యులేషన్ కలిగి ఉండాలనే నిబంధన పెట్టారు. అదేవిధంగా వార, పక్ష పత్రికలు కనీసం 18 నెలల పాటు నిరంతరంగా ప్రచురితమై ఉండాలనే కండీషన్ కూడా ఉంది. డెస్క్ జర్నలిస్టుల విషయంలో మీడియా సంస్థలు కనీసం 33 శాతం మహిళలకు కేటాయించడం తప్పనిసరి చేశారు. అక్రిడిటేషన్ కోటాలో కూడా మహిళా జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కనీసం ఏడాది కాలంగా నడుస్తున్న వెబ్‌సైట్లు, గత ఆరు నెలల్లో సగటున నెలకు 5 లక్షల యూనిక్ విజిటర్లను కలిగి ఉన్న పక్షంలో అక్రిడిటేషన్‌కు అర్హలు. కార్డు జారీ తర్వాత అక్రిడిటేషన్ కార్డు పోతే డూప్లికేట్ లేదా రీప్లేస్‌మెంట్ కార్డుల కోసం రూ.250 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







