మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- February 06, 2026
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం తీవ్ర పేలుడు చోటుచేసుకుంది. శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఒక మసీదులో బాంబు పేలినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం కాగా, పదుల సంఖ్యలో భక్తులు గాయపడినట్లు వెల్లడైంది.
ప్రాథమికంగా ఇది ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో మసీదు పరిసరాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఘటనాస్థలికి పోలీసులు, సైన్యం, రెస్క్యూ బృందాలు భారీగా చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
అత్యవసర పరిస్థితి – ఆస్పత్రుల్లో హై అలర్ట్
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఇస్లామాబాద్(Islamabad Blast) గ్రాండ్ మసీదుగా పిలవబడే కస్ర్-ఎ-ఖాదీజతుల్ కుబ్రా మసీదులో ఈ పేలుడు జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్రమత్తత చర్యల్లో భాగంగా ఇస్లామాబాద్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు సమాచారం.
గాయపడిన వారిని పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS), CDA ఆస్పత్రులకు తరలించారు. పిమ్స్ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ ప్రకటించి, ట్రామా, ఆర్థోపెడిక్, బర్న్, న్యూరాలజీ విభాగాలను సిద్ధం చేసినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ దాడికి బాధ్యులుగా ఏ సంస్థ లేదా గ్రూప్ బాధ్యత వహించలేదు.ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







