రెస్టారెంట్‌లోకి ప్రవేశించిన ఆరుగురు ప్రవాసులపై బహిష్కరణ వేటు..!!

- June 03, 2025 , by Maagulf
రెస్టారెంట్‌లోకి ప్రవేశించిన ఆరుగురు ప్రవాసులపై బహిష్కరణ వేటు..!!

కువైట్: జులీబ్ అల్-షుయౌఖ్‌లో గతంలో సీజ్ చేసిన ఒక రెస్టారెంట్‌ను తెరిచిన కేసులో ఆరుగురు ప్రవాసులపై చర్యలు తీసుకున్నారు. వారిని బహిష్కరించినట్ల పేర్కొన్నారు. దీనిని గతంలో కువైట్ అగ్నిమాపక దళం సీలు చేసింది. మూసివేయబడిన రెస్టారెంట్‌ను చట్టవిరుద్ధంగా తిరిగి తెరిచారని నివేదిక అందిన తర్వాత రెసిడెన్సీ వ్యవహారాల దర్యాప్తు విభాగం అధికారులు వారిని అరెస్టు చేశారు. వారు వెనుక తలుపు ద్వారా ప్రవేశించి, రెస్టారెంట్ నుండి తమ వస్తువులను బయటకు తీసినట్లు గుర్తించారు.

అయితే, మూసివేసిన ఏదైనా ప్రాంగణంలోకి, ఎలా దేనికోసం ప్రవేశించినా, అది చట్టపరమైన ఉల్లంఘన అని అధికారులు చెప్పారు. ఏదైనా ఎంట్రీ పాయింట్ ద్వారా మూసివేత ఆదేశాలను దాటవేయడం ఖచ్చితంగా నిషేధించబడిందని అగ్నిమాపక దళ ప్రతినిధి ధృవీకరించారు. కువైట్ నిబంధనల ప్రకారం.. అటువంటి ఆదేశాలను ఉల్లంఘించే ప్రవాసులు బహిష్కరించబడతారని, అయితే కువైట్ పౌరులు, ఇందులో పాల్గొంటే, చట్టపరమైన చర్యల కోసం కోర్టులకు రిఫర్ చేస్తామని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com