వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు.. ఒత్తిడికి గురికావొద్దు: సౌదీ హెల్త్ మినిస్ట్రీ
- June 04, 2025
రియాద్: వార్షిక హజ్ యాత్ర ప్రారంభానికి గుర్తుగా యాత్రికులు మినాకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. యాత్రికుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసకోవాలని సూచించింది. వేసవి సమయంలో అనారోగ్యాలను నివారించడానికి గొడుగులు ఉపయోగించాలని, దాహం వేయకపోయినా క్రమం తప్పకుండా నీరు త్రాగాలని, లేత రంగు, తేలికైన దుస్తులు ధరించాలని యాత్రికులకు సూచించింది.
అధిక వేడికి గురైతే(సన్ స్ట్రోక్) లక్షణాలు అయిన తలనొప్పి, తల తిరగడం, అధిక చెమట, దాహం, వికారం వంటి ఉంటాయని, అవి కనిపంచగానే వెంటనే వైద్య బృందాలను సంప్రదించాలని కోరారు. యాత్రికులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యక్ష సూర్యకాంతికి గురికాకుండా ఉండాలని, వేడి ఉపరితలాలపై నడవకుండా ఉండాలని, పర్వతాలను ఎక్కడం వంటి కఠినమైన కార్యకలాపాలలో పాల్గొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పవిత్ర స్థలాలలో వ్యూహాత్మకంగా 34 కి పైగా ఫీల్డ్ హెల్త్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







