2018 నాటికి బందర్ పూర్తిచేస్తాం: కొల్లు రవీంద్ర
- July 12, 2016
2018 నాటికి బందరు పోర్టు నుంచి మొదటి షిప్‌ను నడుపుతామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కొద్ది సేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన..ప్రభుత్వంపై కాంగ్రెస్ చేసే ఆరోపణలు వింతగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్, వైసీపీ నేతల వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. టీడీపీ అభివృద్ధిని చూడలేకే అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరు పోర్టు భూసమీకరణపై విపక్షాలు అవవసర రాద్ధాంతం చేయడం సబబు కాదన్నారు. వైఎస్ హయాంలో మూడున్నర లక్షల ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారన్న విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. భూసంతర్పణలో కీలకపాత్ర పోషించిన ధర్మాన ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు..ఉనికి కోసమే రైతులను రెచ్చగొడుతున్నాయని...వాటన్నింటి మానుకోని రాష్ట్రాభివృద్ధికై కలిసి రావాలని కొల్లు రవీంద్ర సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







