16న అన్ని రాష్ట్రాల సీఎంల సమావేశానికి పిలుపునిచ్చిన మోడీ
- July 12, 2016
రాష్ట్రాల మధ్య సఖ్యత, అంతర్గత రక్షణ, ఆర్థిక, సామాజిక ప్రణాళికల గురించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జులై 16న సమావేశం నిర్వహించనున్నారు. పది సంవత్సరాల విరామం తర్వాత జరగనున్న 11వ అంతర్రాష్ట్ర సదస్సులో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు.
పాఠశాల విద్య, ప్రత్యక్ష నగదు బదిలీ పథకం, ఆధార్ కార్డు, గుడ్ గవర్నెన్స్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్ , సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, మనోహర్‌పారికర్ ఈ కౌన్సిల్‌లో నామినేటెడ్ సభ్యులుగా ఉంటారు. మరో 11 మంది కేంద్రమంత్రులు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.
కశ్మీర్ సంక్షోభం నేపథ్యంలో జరుగుతున్న సమావేశానికి గట్టి భద్రత కల్పించనున్నారు. చివరిసారిగా 2006లో యూపీఏ హయాంలో సమావేశం జరిగింది. పదేళ్ల యూపీఏ పదవీకాలంలో కేవలం రెండుసార్లు మాత్రమే ఇలాంటి సమావేశాలు జరిగాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి పెరిగే విధంగా చర్యలు తీసుకోవడానికి కౌన్సిల్ తోడ్పడుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







