చంద్రబాబు విదేశీ పర్యటనల వల్ల ఆంధ్రాకు పెట్టుబడులు
- July 12, 2016
పెట్టుబడులే లక్ష్యంగా శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు ఫలితాన్నిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఏపీ బాటపడుతున్నారు. ఇవాళ.. చైనా బృందంతో ఏపీకి చెందిన కేంద్రమంత్రులు అశోకగజపతిరాజు, సుజనాచౌదరి సమావేశమయ్యారు. అమరావతిలో పారిశ్రామిక జోన్, హైస్పీడ్ రైలు కనెక్టవిటీపై నిశితంగా చర్చించారు. ఏపీలో పెట్టుబడుల అంశంపై చర్చించారు. సీఎం చంద్రబాబుతో మరోసారి చర్చించి పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటామని చైనా బృందం మంత్రులకు చెప్పింది. కాగా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన చైనా కంపెనీల ప్రతినిధులకు కేంద్ర మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు రష్యా టూర్ ముగించుకుని వచ్చిన తరువాత మరోసారి ఏపీలో పర్యటిస్తామని చైనా బృందం మంత్రులతో చెప్పింది.
తాజా వార్తలు
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం







