తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..

- June 05, 2025 , by Maagulf
తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..

హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. 5 గంటల పాటు సుదీర్ఘంగా మంత్రివర్గ సమావేశం సాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు మీడియాకు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.

ఉద్యోగుల డిమాండ్లపై క్యాబినెట్ లో సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించాలని క్యాబినెట్ నిర్ణయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తక్షణమే ఒక డీఏను చెల్లిస్తామన్నారు. 6 నెలల్లో రెండో డీఏను ఇస్తామన్నారు. ఉద్యోగుల ఆరోగ్య బీమాకు సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు.

ఉద్యోగుల హెల్త్ కార్డ్ విషయంలో ప్రతి ఉద్యోగి నెలకు 500 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వమూ కొంత మొత్తం జమ చేస్తుందన్నారు. ఈ మొత్తంతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలను నెలల వారీగా క్లియర్ చేస్తామన్నారు. నెలకు రూ.700 కోట్లకు తగ్గకుండా పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని మంత్రులు ప్రకటించారు. ఎన్నికల సమయంలో చేసిన ఉద్యోగుల బదిలీలను వెనక్కి తీసుకొస్తామన్నారు. అంగన్ వాడీ ఉద్యోగుల రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ను రూ.2లక్షల వరకు పెంపు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

  • ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించాలని నిర్ణయం
  • నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం
  • ములుగులో పామాయిల్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయించేందుకు నిర్ణయం
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com