హెరిటేజ్ ఫుడ్స్ 34 ఏళ్ల ప్రస్థానంపై నారా బ్రాహ్మణి సంతోషం
- June 05, 2025
హెరిటేజ్ ఫుడ్స్ 34వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంస్థ వ్యవస్థాపకుడు నారా చంద్రబాబు దార్శనికతను ప్రశంసించారు.లోకేశ్ మాట్లాడుతూ, హెరిటేజ్ ఫుడ్స్ నాకు గర్వకారణం. ఈ సంస్థ రైతుల ఆర్థిక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషించింది. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించడంలోనూ నిరంతరం ముందుండుతోంది, అన్నారు.ఈ వేడుకలో పాత స్నేహితులను, సహచరులను కలవడం తనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని లోకేశ్ తెలిపారు. సంస్థకు ఉన్న బలమైన విలువలు, నాయకత్వం తనను ఎంతో ఉత్తేజితం చేశాయని చెప్పారు. భవిష్యత్తులో ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని లోకేశ్ మొక్కను నాటారు. ఈ సంస్థ రైతులకు, వినియోగదారులకు మధ్య నమ్మకపు బంధాన్ని కొనసాగిస్తుందని చెప్పారు.ఈ వేడుకల్లో నారా బ్రాహ్మణి కూడా మాట్లాడారు. 1992లో మా మామ పెట్టిన ఈ బీజం, ఇప్పుడు కోట్లాది మందికి నాణ్యతను అందిస్తున్న సంస్థగా ఎదిగింది. రైతులకు భరోసా, వినియోగదారులకు నమ్మకం అనే రెండు లక్ష్యాలతో మేము ముందుకు సాగుతున్నాం, అన్నారు.
రూ.4,000 కోట్ల ఆదాయ మైలురాయి
2025లో సంస్థ రూ.4,000 కోట్ల వార్షిక ఆదాయాన్ని సాధించడం పట్ల ఆమె గర్వం వ్యక్తం చేశారు. ఇది మా 3,300 మంది ఉద్యోగుల శ్రమ ఫలితం, అంటూ అభినందనలు తెలిపారు.హెరిటేజ్ విజయయాత్రలో భాగస్వాములైన ప్రతి ఉద్యోగికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నారా లోకేశ్ ఉత్సాహపూరిత సందేశం సంస్థకు కొత్త శక్తిని ఇచ్చిందని చెప్పారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్