ప్రొ కబడ్డీలో బెంగళూరుపై గెలిచిన తెలుగు టైటాన్స్‌

- July 12, 2016 , by Maagulf
ప్రొ కబడ్డీలో బెంగళూరుపై గెలిచిన తెలుగు టైటాన్స్‌

ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా బెంగళూరు బుల్స్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 8 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే బెంగళూరు డిఫెండర్లపై టైటాన్స్‌ కెప్టెన్‌ రాహుల్‌ చౌదరి వరుస రైడ్లతో ఎదురుదాడి చేయడంతో ఒకానొక దశలో తెలుగు టైటాన్స్‌ 10-1తో నిలిచింది. దీంతో ప్రథమార్థం ముగిసే సమయానికి 16-10తో ఆధిక్యం సాధించిన టైటాన్స్‌ ద్వితీయార్థంలో కాస్త తడబడినట్లు కనిపించింది.
కానీ చివర్లో పుంజుకున్న టైటాన్స్‌ తప్పిదాలను తగ్గించుకోవడంతో మ్యాచ్‌ను 32-24తో గెలుపుగా ముగించగలిగింది. ఈ విజయంతో తెలుగు టైటాన్స్‌ 24 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com