ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న 'రియో డి జనారియో'
- July 12, 2016
మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్ పండగ ప్రారంభం కానుంది. రియో డి జనారియో వేదికగా జరగబోయే ఈ పోటీల కోసం ప్రపంచ క్రీడాకారులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 5 నుంచి21 వరకు సాగే ఈ ఉత్సవానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
* దక్షిణ అమెరికాలో ఒలింపిక్స్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి.* 17 వేల మంది ఒలింపిక్ అథ్లెట్లు, నిర్వాహకులు పాల్గొంటున్నారు. . * 206 దేశాలకు చెందిన క్రీడాకారులు పలు విభాగాల్లో పోటీపడనున్నారు. * ఒలింపిక్స్ పండగను ప్రారంభించే మరకానా స్టేడియం సామర్థ్యం 78 వేల మంది. ఇదే స్టేడియంలో ముగింపు వేడుకలు కూడా నిర్వహించనున్నారు. * తొలిసారిగా ఓ శరణార్థుల జట్టు ఈ ఒలింపిక్స్‌లో పాల్గొననుంది. * పోటీలను వీక్షించేందుకు కోసం 75 లక్షల టిక్కెట్లను అమ్మకానికి ఉంచారు. * 5 లక్షల మంది విదేశీ పర్యాటకులు వస్తారని అంచనా. * ఒలింపిక్స్ కోసం ప్రత్యేకంగా 16 కిలోమీటర్ల పొడవుగల భూగర్భ మెట్రో వ్యవస్థను ఏర్పాటు చేశారు. * 61 శాతం మంది స్థానికులు రియోలో పోటీలను నిర్వహించడం గొప్పగా భావిస్తే.. 27శాతం మంది మాత్రం అవసరం లేదంటున్నారు. * ఒలింపిక్స్ సమయంలో క్రీడా గ్రామంలోని డైనింగ్ హాల్లో రోజుకు 60వేల భోజనాలను వడ్డించనున్నారు. * 25వేల మంది విలేకరులు ఈ పోటీల కవరేజీకి వస్తున్నారు. * ఫుట్‌బాల్ పోటీల కోసం 400 బంతులను వినియోగించనున్నట్లు అంచనా. * ఫుట్‌బాల్ దేశంగా పేరొందిన బ్రెజిల్ ఒలింపిక్స్‌లో ఒక్కసారి కూడా పతకం సాధించలేకపోయింది.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







