16న విడుదల కానున్న 'ఇంకొక్కడు' పాట టీజర్
- July 12, 2016
విక్రమ్, నయనతారా, నిత్యామేనన్ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న తమిళ చిత్రం 'ఇరుముగన్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఇంకొక్కడు' అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఇందులోని ఓ పాట టీజర్‌ను ఈ నెల 16న విడుదల చేస్తున్నట్లు చిత్ర మ్యూజిక్ భాగస్వామి సోని మ్యూజిక్ సౌత్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా ఒక పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ఆనంద్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని థమీన్స్ ఫిల్మ్స్ పతాకంపై శిభు థమీన్స్ నిర్మిస్తున్నారు. నాజర్, తంబి రామయ్య, బాల, కరునాకరణ్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం తెలుగు టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







