భారత్, బంగ్లాదేశ్లకు పొంచిఉన్న ముప్పు
- July 12, 2016
భారతపై భారీ భూకంపం విరుచుకుపడబోతోందా? ఈశాన్య ప్రాంతాన్ని నాశనం చేసేందుకు బంగ్లాదేశ సరిహద్దుల్లో 'రహస్యం'గా పొంచిఉందా? అంటే అవుననే హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. బంగ్లాదేశ సరిహద్దుల్లోని భూఅంతర్భాగంలో ఇది ఏర్పడే ప్రమాదముందని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది. భూమి అడుగున ఉన్న టెక్టానిక్ట్ ప్లేట్ల మధ్య ఒత్తిడి అధికంగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనివల్ల భారతలోని ఈశాన్య భారతంలోని పట్టణ ప్రాంతాలు 'నాశన'మవుతాయని హెచ్చరించారు. సుమారు 14కోట్ల మందిపై ఈ ప్రభావం పడుతుందని తెలిపారు. దీనివల్ల అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ముఖ్యంగా ప్రధాన నదుల్లోని నీటి మట్టాల్లో, నీటి ప్రవాహాల్లో గణనీయమార్పులు చోటుచేసుకుంటాయని వెల్లడించారు. భూమి పొరల్లోని టెక్టానిక్ట్ ప్లేట్లు కుంగిపోవడం వల్ల ఆ భూభాగంలో ఒత్తిడి పెరిగి, ఎక్కువగా భూకంపాలు సంభవిస్తున్నాయని వివరించారు. హిందూ మహాసముద్రంలోని భూకంపం, 2004లో సుమారు 2,30,000మందిని పొట్టనపెట్టుకున్న సునామీ, 2011 తొహోకూలో భూకంపం సంభవించిన ప్రాంతాలన్నీ ఇలా ఏర్పడినవేనన్నారు. ఊహించని పరిణామాలు ఎదురైతే.. బీభ త్సం తప్పదని, రిక్టర్ స్కేల్‌పై 8.2 కంటే ఎక్కువ తీవ్రతలో భూ కంపం విరుచుకుపడుతుందని శాస్త్రవేత్త మైకెల్ స్టెక్లర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









