ఆధునిక ప్రజా రవాణా కోసం.. ఖతార్ లో పబ్లిక్ సర్వే..!!

- June 10, 2025 , by Maagulf
ఆధునిక ప్రజా రవాణా కోసం.. ఖతార్ లో పబ్లిక్ సర్వే..!!

దోహా, ఖతార్: దేశంలో ప్రజలకు అనుకూలమైన ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించడానికి, రవాణా మంత్రిత్వ శాఖ (MoT) ఖతార్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మాస్టర్ ప్లాన్‌పై సర్వేను నిర్వహిస్తోంది. ఇది జూన్ నెలంతా కొనసాగుతుందని తెలిపింది. ఖతార్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మాస్టర్ ప్లాన్‌పై పబ్లిక్ సర్వేను నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తన అధికారిక X ఖాతాలో తెలిపింది. MoT ఫీల్డ్ సర్వే ప్రచారం జూన్ 2025 వరకు కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మెట్రో స్టేషన్లు, ట్రామ్‌లు, బస్సులు, మార్కెట్‌ప్లేస్‌లు, షాపింగ్ మాల్స్‌లో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెరుగైన సేవలందించడానికి తాము ప్రజా రవాణాను మెరుగుపరచాలని ప్రణాళికలు రూపొందించేందుకు సర్వే ఫలితాలు దోహదం చేస్తాయన్నారు. ఖతార్ వేగవంతమైన పట్టణ వృద్ధి, స్థిరత్వానికి దాని నిబద్ధత మధ్య సమతుల్యతను సాధించడం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రజా రవాణా వ్యవస్థ లక్ష్యంగా ఖతార్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మాస్టర్ ప్లాన్ (QPTMP) ను అభివృద్ధి చేయడం ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com