డ్రైవింగ్ చేసే సమయంలో నీళ్లు తాగడం, తినడం నేరమా?
- June 11, 2025
కువైట్: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నీళ్లు తాగడం లేదా తినడం, స్మోకింగ్ చేయడం నేరంగా పరిగణించే చట్టపరమైన నిబంధన లేదని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ట్రాఫిక్ అవగాహన విభాగం యాక్టింగ్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా బు హసన్ స్పష్టం చేశారు. అయితే, అలాంటి చర్యలు అజాగ్రత్త లేదా రోడ్డు నుండి దృష్టి మరల్చడానికి దారితీస్తే, డ్రైవర్ పై కేసులు నమోదు చేయవచ్చని తేల్చిచెప్పారు. నిర్దేశిత వేగ పరిమితులను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. లేదంటే ట్రాఫిక్ చలానా విధిస్తారని పేర్కొన్నారు.
కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘనలు 75% తగ్గాయని బు హసన్ పేర్కొన్నారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే రోడ్డు మరణాలు కూడా 55% తగ్గాయన్నారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అత్యంత జాగరూకతతో ఉండాలని సూచించారు. ట్రాఫిక్ చలానా చెల్లింపు లింకుల పేరిట జరుగుతున్న సైబర్ ఫ్రాడ్ లపై స్పందించారు. ఆన్లైన్ చెల్లింపులు చేసేటప్పుడు లేదా అధికారికంగా కనిపించే పోర్టల్లను యాక్సెస్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







