దక్షిణాఫ్రికాలో సాంస్కృతిక పర్యటన.. రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!

- June 12, 2025 , by Maagulf
దక్షిణాఫ్రికాలో సాంస్కృతిక పర్యటన.. రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!

దోహా: నోమాస్ సెంటర్ నిర్వహించే 9 నుండి 14 సంవత్సరాల వయస్సు గల అబ్బాయిల కోసం దక్షిణాఫ్రికాకు సాంస్కృతిక పర్యటన కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నట్లు ఖతార్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ యాత్ర 2025 ఆగస్టు 1 నుండి 9 వరకు జరగనుంది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. రిజిస్ట్రేషన్ రుసుము QR6,000గా నిర్ణయించారు. ఇందులో విమాన ఛార్జీలు, వసతి, రవాణా, వర్క్‌షాప్ ఫీజులు ఉంటాయని తెలిపారు.

సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో అనుబంధంగా ఉన్న నోమాస్ సెంటర్.. పిల్లలను ఖతారీ వారసత్వం, సాంప్రదాయ ఆచారాలకు సంబంధించిన కార్యకలాపాలలో.. సముద్ర సంబంధ కార్యకలాపాలలో పాల్గొనేలా చేయడం ద్వారా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ పర్యటనను చేపడుతున్నారు. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com