ఎయిర్ ఇండియా ప్రమాదం..సాధారణ స్థితికి చేరుకున్న విమానయాన సంస్థలు..!!

- June 13, 2025 , by Maagulf
ఎయిర్ ఇండియా ప్రమాదం..సాధారణ స్థితికి చేరుకున్న విమానయాన సంస్థలు..!!

యూఏఈ: ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయడం వల్ల యూఏఈ నుండి అహ్మదాబాద్‌కు వెళ్లే ఒకే ఒక విమానం ప్రభావితమైంది.అబుదాబి నుండి అహ్మదాబాద్ విమానాశ్రయానికి వెళ్లాల్సిన ఎతిహాద్ విమానం EY 240 రెండు గంటలు ఆలస్యంగా వెళ్లిందని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. అహ్మదాబాద్‌కు వెళ్లే విమానం అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరాల్సి ఉంది. బదులుగా అది యూఏఈ సమయం ప్రకారం సాయంత్రం 4.16 గంటలకు బయలుదేరి రాత్రి 8.32 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంది (భారత సమయం). మరోవైపు దుబాయ్‌కు చెందిన క్యారియర్‌లు తమ కార్యకలాపాలలో ఎటువంటి ఆలస్యం జరగలేదని తెలిపాయి. ఎమిరేట్స్ విమానం (EK 538), ఫ్లైదుబాయ్ (FZ 437) దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) నుండి షెడ్యూల్ ప్రకారం రాత్రి 10.50 మరియు రాత్రి 11.10 (UAE సమయం) గంటలకు బయలుదేరాల్సి వెళ్లాయని తెలిపారు.  
ఫ్లైదుబాయ్ సంతాపం
242 మంది ప్రయాణికులు మరియు సిబ్బందితో లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో (భారత సమయం) కూలిపోయింది. అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని మేఘనినగర్ ప్రాంతంలో టేకాఫ్ అయిన ఐదు నిమిషాల తర్వాత అది నివాస ప్రాంతంలో కూలిపోయింది. దాదాపు 400కుపైగా మంది మరణించి ఉంటారని భావిస్తున్నారు. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్ సంతాపం ప్రకటించింది. "ఈ రోజు జరిగిన దురదృష్టకర సంఘటన గురించి విని మేము బాధపడ్డాము. ప్రభావితమైన వారందరికీ మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము. మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము.  అహ్మదాబాద్‌కు మా విమానాలు ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి." అని అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com