దుబాయ్ మెట్రో రైలు పట్టాల తనిఖీకి AI-ఆధారిత రోబోట్‌..!!

- June 13, 2025 , by Maagulf
దుబాయ్ మెట్రో రైలు పట్టాల తనిఖీకి AI-ఆధారిత రోబోట్‌..!!

దుబాయ్: దుబాయ్ మెట్రో రైలు పట్టాలు, సంబంధిత మౌలిక సదుపాయాలను తనిఖీ చేయడానికి "ప్రోయాక్టివ్ మెయింటెనెన్స్ స్ట్రాటజీస్" కలిగిన AI-ఆధారిత రోబోట్ ఇన్‌స్పెక్టర్‌ను ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. ఇది కార్యాచరణ సామర్థ్యాన్ని 75 శాతం పెంచుతుందని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. ARIIS లేదా ఆటోమేటెడ్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్పెక్షన్ సిస్టమ్ అని పిలువబడే ఈ రోబోటిక్ ప్లాట్‌ఫామ్ అధునాతన LiDAR (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్) సెన్సార్‌లు, లేజర్‌లు, 3D కెమెరాలను ఉపయోగించి "మెట్రో కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా రైలు పట్టాలు, కీలకమైన మౌలిక సదుపాయాలను స్వయంచాలకంగా తనిఖీ చేస్తుంది" అని ఆర్టీఏ పేర్కొంది.
RTA ప్రకారం.. ARIIS కార్యాచరణ సామర్థ్యాన్ని 75 శాతం పెంచుతుంది. దుబాయ్ మెట్రో మౌలిక సదుపాయాలను తనిఖీ చేయడానికి సాధారణంగా మానవ సిబ్బంది అవసరమయ్యే 2,400 మానవ-గంటలను ARIISతో 700 మానవ-గంటలకు తగ్గించవచ్చు. ARIISతో మాన్యువల్ తనిఖీలను 70 శాతం వరకు తగ్గించవచ్చని, అదే సమయంలో మౌలిక సదుపాయాల పరిస్థితిని అంచనా వేయడం 40 శాతం మరింత సమర్థవంతంగా చేయవచ్చని RTA  రైల్ ఏజెన్సీ CEO అబ్దుల్ మొహ్సిన్ కల్బత్ తెలిపారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com