NEET పీజీ అభ్యర్థులకు అలర్ట్​..

- June 13, 2025 , by Maagulf
NEET పీజీ అభ్యర్థులకు అలర్ట్​..

నీట్ పీజీ 2025 పరీక్ష సిటీ రీ- సబ్మిషన్ విండోను జూన్ 13న ఓపెన్​ చేయనున్నారు అధికారులు. ఈమేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అధికారిక ప్రకటన చేసింది. జూన్ 13 మధ్యాహ్నం 3 గంటలకు లింక్ యాక్టివేట్ కానుంది. నీట్ పీజీ ఎలిజిబిలిటీ టెస్ట్​కి హాజరు కావాలనుకునే అభ్యర్థులుhttp://natboard.edu.in లేదా ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్​లో ఈ లింక్​ని పొందొచ్చు.

సిటీని ఎంచుకునేందుకు చివరి తేదీ జూన్ 17.ఇందులో అభ్యర్థులు కేవలం టెస్టింగ్ సీట్లు అందుబాటులో ఉన్న నగరాలను మాత్రమే ఎంచుకోవాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆధారంగా ఎగ్జామ్ సిటీని ఎంపిక చేస్తారు. ఇక ఎడిట్ విండో జూన్ 20 నుంచి జూన్ 22 కొనసాగుతుంది. అనంతరం అడ్మిట్ కార్డుల ద్వారా అధికారులు కచ్చితమైన పరీక్ష కేంద్రాన్ని అభ్యర్థులకు తెలియజేస్తారు. అడ్మిట్ కార్డును 2025 జులై 31న, పరీక్షను ఆగస్టు 3 నిర్వహిస్తారు. నీట్​ పీజీ 2025 ఫలితాలను సెప్టెంబర్ 3న ప్రకటిస్తారు.

  • ముందుగా http://natboard.edu.in ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్​ కి వెళ్ళాలి.
  • హోమ్ పేజీలో నీట్ పీజీ 2025 ఎగ్జామ్ సిటీ రీ సబ్మిషన్ విండోపై క్లిక్ చేయాలి.
  • లాగిన్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
  • ఇక్కడ పరీక్ష నగరం, ఇతర వివరాలను ఎంచుకోవాలి.
  • తరువాత సబ్మిట్​ బటన్ పై క్లిక్ చేసి కన్ఫర్మేషన్ పేజీని డౌన్​లోడ్​ చేసుకోవాలి.
  • ఇంకా దీనికి సంబందించిన వివరాల కోసం ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్​ కి వెళ్లి తెలుసుకోండి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com