మృత్యుంజయుడు విశ్వాశ్ కుమార్ ను ప్రత్యేకంగా కలిసిన ప్రధాని మోదీ
- June 13, 2025
అహ్మదాబాద్: గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో జరిగిన ఈ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ కూల్చిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర స్పందన రేకెత్తించింది. 241 మంది మృతి, ఒకే ఒక్కరి ప్రాణాలు పరిరక్షితమవడం–ఇది స్వతంత్ర భారత విమాన చరిత్రలోనే అత్యంత విషాదకర సంఘటనగా నమోదైంది.కేవలం ఒక వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడిగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌ల ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ, నేరుగా మేఘానీనగర్‌లోని ప్రమాద స్థలానికి వెళ్లారు. ఆయన వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. అనంతరం, ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వాశ్ కుమార్ రమేశ్‌ను ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
“అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఇది మాటలకు అందని విషాదం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రభుత్వం బాధితులకు సకాలంలో అవసరమైన సాయం అందించేందుకు కట్టుబడి ఉంది” అని పేర్కొన్నారు. ఈ ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎక్స్ వేదికగా నిన్న మోదీ పేర్కొన్నారు.
ఈ విమాన ప్రమాదం విషాదం నింపినప్పటికీ, విశ్వాశ్ కుమార్ రమేశ్ ప్రాణాలతో బయటపడటం ఆశాజనక విషయంగా మారింది. ప్రధానమంత్రి మోదీ ఆయనను వ్యక్తిగతంగా పరామర్శించి ధైర్యం చెప్పిన చర్య దేశ ప్రజలను భావోద్వేగానికి గురిచేసింది. ఈ ఘటన పైత్యం, బాధతో పాటు భద్రతా ప్రమాణాల పునఃసమీక్ష అవసరాన్ని కూడా ఋజువు చేస్తోంది.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి