స్పెషల్ ఆపరేషన్.. ఖైతాన్‌లో 20 మంది ప్రవాసులు అరెస్టు..!!
- June 13, 2025
కువైట్: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖైతాన్‌లో భద్రతా, ట్రాఫిక్ ఆపరేషన్ ను నిర్వహించింది. ఇందులో భాగంగా 705 ట్రాఫిక్ సైటేషన్లు జారీ చేశారు. నివాస, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన 20 మందిని అరెస్టు చేశారు. గుర్తింపు లేకుండా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా పరారీలో ఉన్న 10 మంది వ్యక్తులతోపాటు అరెస్ట్ వారెంట్లు జారీ అయిన 12 మందిని కూడా అధికారులు అరెస్టు చేశారు.
అలాగే, అనుమానిత మాదకద్రవ్యాలు, మద్యం కలిగి ఉన్న ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే కేసులు ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







