సార్ కారు ప్రమాదం.. మూడుకు చెరిన మృతుల సంఖ్య..!!
- June 13, 2025
మనామా: కొద్ది రోజుల క్రితం సార్‌లో జరిగిన విషాదకరమైన కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన యువకుడు అబ్దుల్ అహ్మద్ మరణించాడు. ఈ ప్రమాదంలో అతని తల్లిదండ్రులు అప్పటికే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబం విహారయాత్రకు వెళుతుండగా వారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బాలుడి తండ్రి, తల్లి మరణించగా, వారి ముగ్గురు పిల్లలు - అబ్దుల్ అజీజ్, అతని సోదరి అయా, అన్నయ్య యూసిఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా, ప్రమాదం జరిగిన సమయంలో అబ్దుల్ అజీజ్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. వైద్య బృందం అవిశ్రాంత ప్రయత్నాలు చేసినప్పటికీ, అతని పరిస్థితి మరింత దిగజారిందని, అతను శుక్రవారం తెల్లవారుజామున మరణించాడని పేర్కొన్నారు. గాయపడిన అతని సోదరి అయా కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. వారి అన్నయ్య యూసిఫ్ చికిత్స కొనసాగుతుందని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ విషాదం స్థానిక కమ్యూనిటీని తీవ్రంగా కలచివేసింది. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని అనేకమంది ఆస్పత్రి వద్ద ప్రార్థించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







