నా నాన్న

- June 15, 2025 , by Maagulf
నా నాన్న

అనుక్షణం నీడలా కాచేవాడు                                                                                                      అంబారీలా మోసే ఏనుగతడు                                                                                        అవసరాలు తీర్చే నిరాడంబరుడు అన్నింటా చేయూతనిచ్చే మహానీయుడు                              అతని స్వంత అవసరాలని పట్టించుకోడు .....

అణువణువునా నిక్షిప్తమైన మార్గదర్శకుడు 
అనుభవాలని ఎన్నింటినో ఔపాసన పట్టిన 
అనంతమైన వ్యక్తం చేయలేని ప్రేమని నింపుకొన్న 
అన్ని బాధలు గరళాన దాచుకున్న 
అమృతాన్ని పంచేటి భోళాశంకరుడు....


అల్లరి ఎంతచేసిన భరించే శూరుడు 
అనుభవాలు పాఠాలుగా చెప్పే బోధకుడు 
అందరి అవసరాలు తీర్చే త్యాగధనుడు
అన్ని వేళలా మనమున  కాపుకాచే రక్షకుడు 
అరవై యేండ్లు వచ్చిన పట్టువదలని విక్రమార్కుడు... 

తనకంటూ జీవితాన్ని మర్చిపోయి
తన బిడ్డల భవిష్యత్తుకై కష్టపడుతూ 
అర్ధం కాడు ఏనాటికీ ఎన్నటికి 
ఆటంకాలు ఎన్నో ఎదుర్కొనే ధీరుడు 
అన్ని వున్న ఎప్పుడూ ఒంటరివాడే నా నాన్న

--యామిని కోళ్ళూరు✍️

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com