ముగ్గురు ఉద్యోగులను తొలగించాలని ఎయిరిండియా ఆదేశాలు

- June 21, 2025 , by Maagulf
ముగ్గురు ఉద్యోగులను తొలగించాలని ఎయిరిండియా ఆదేశాలు

గుజరాత్‌లోని అహ్మదాబాద్ వద్ద జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పై విమానయాన రంగంలో తీవ్ర కలకలం రేపింది.ఈ ఘటనలో 270 మందికిపైగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంతో విమాన భద్రతపై ప్రశ్నలు లేవెత్తాయి.ఈ ఘటనకు సంబంధించిన విచారణలో భద్రతా లోపాలు స్పష్టమయ్యాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తేల్చింది. ఈ నేపథ్యంలో ప్రమాదానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను తక్షణమే తొలగించాలని ఎయిర్ ఇండియాకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.

ఫ్లీట్ సేఫ్టీపై ప్రయాణికులు మరియు ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

ఘటన జరిగిన మరుసటి రోజు ఎయిర్ ఇండియా సీఈవో కాంపెల్ విల్సన్ స్పందిస్తూ.. ఫ్లీట్ సేఫ్టీపై ప్రయాణికులు మరియు ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అయితే ప్రయాణికుల భద్రత విషయంలో కచ్చితమైన ప్రమాణాలు పాటించడంలో కొంత విఫలమయ్యారని అధికారులు గుర్తించారు. అందుకే బాధ్యత వహించాల్సిన కీలక సిబ్బందిని తొలగించేందుకు డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా విమానయాన సంస్థలకు స్పష్టంగా సూచించింది.

విమాన భద్రత పై మరింత కఠిన చర్యలు

ఇకపోతే ఈ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలవరపాటు కలిగించింది. 270 మందికిపైగా మరణించడంతో సహానుభూతి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.విమాన భద్రతపై మరింత కఠిన చర్యలు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఎయిర్ ఇండియా యాజమాన్యం ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ భద్రత ప్రమాణాల పునఃపరిశీలన చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.ఈ ఘటన తర్వాత దేశంలోని అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ సాంకేతిక బృందాలను అప్రమత్తం చేస్తూ భద్రత నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com