మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- October 16, 2025
మక్కా: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ మక్కాలో "కింగ్ సల్మాన్ గేట్" ప్రాజెక్టును ప్రారంభించినట్లు ప్రకటించారు. 12 మిలియన్ చదరపు మీటర్ల నిర్మాణ ప్రాంతాన్ని కలిగి ఉన్న కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు.. మక్కా మౌలిక సదుపాయాలు మరియు పట్టణ అభివృద్ధి నమూనాగా ఉండనుంది.
గ్రాండ్ మసీదు సమీపంలో వ్యూహాత్మకంగా ఉన్న కింగ్ సల్మాన్ గేట్.. పవిత్ర మసీదు చుట్టూ నివాస, సాంస్కృతిక మరియు సేవా సౌకర్యాలను అందిస్తుంది. దీని ద్వారా దాని ఇండోర్ మరియు అవుట్డోర్ ప్రార్థన ప్రాంతాలలో సుమారు 9లక్షల మంది ఆరాధకుల సామర్థ్యం పెరుగుతుంది. విజిటర్స్ అనుభవాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు 19 వేల చదరపు మీటర్ల వారసత్వ మరియు సాంస్కృతిక మండలాలను పునరుద్ధరించబడుతుంది. 2036 నాటికి 3లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించడం ద్వారా ఆర్థిక వైవిధ్యానికి దోహదపడనుంది.
కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టును గ్రాండ్ మసీదు చుట్టూ పట్టణ అభివృద్ధి ప్రమాణాలను పెంచే ప్రయత్నాలకు నాయకత్వం వహించే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (PIF) అనుబంధ సంస్థ అయిన రౌ అల్-హరామ్ అల్-మక్కీ కంపెనీ అభివృద్ధి చేస్తోంది.
తాజా వార్తలు
- కువైట్‌లో 360 మాల్ సమీపంలో రోడ్ మూసివేత..!!
- ఒమన్‌లో జ్యువెలరీ కొనుగోలుదారులకు ఊరట..!!
- సౌదీ అరేబియాలో ఒకే నెలలో భారీగా ఆరిజిన్ సర్టిఫికెట్లు జారీ..!!
- బహ్రెయిన్‌లో రెస్టారెంట్ మేనేజర్‌కు మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో పర్యాటకులకు QR150 ఉచిత ఇంధన వోచర్లు..!!
- దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పార్కింగ్ ఛార్జీలు గంటకు Dh25..!!
- GMU అలుమ్ని సమ్మిట్ 2026.. నాలుగు దేశాల్లో కొత్త అంతర్జాతీయ అలుమ్ని చాప్టర్ల ప్రారంభం
- దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2026.. డిసెంబర్ 4 నుంచి 45 రోజుల పాటు సందడే సందడి!
- ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
- సౌదీ–కువైట్ నేతల మధ్య కీలక చర్చలు







