కువైట్ లో ఇల్లీగల్ పార్కింగ్‌లపై కొరడా..!!
- October 16, 2025
కువైట్: కువైట్ జనరల్ ట్రాఫిక్ విభాగం ఇల్లీగల్ పార్కింగ్ లపై ప్రత్యేక కార్యాచరణను ప్రకటించింది. ముఖ్యంగా హాస్పిటల్స్ వద్ద ట్రాఫిక్ చట్టాల అమలుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలిపింది. వివిధ గవర్నరేట్‌లలోని ఆసుపత్రుల ముందు ఇటీవల అక్రమ పార్కింగ్ ప్రాక్టిస్ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తుందని, ముఖ్యంగా అత్యవసర వాహనాలను ఆసుపత్రులలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుందని తెలిపింది. అదే సమయంలో హాస్పిటల్ కు వచ్చే రోగులకు అసౌకర్యాన్ని కలిగజేస్తుందని పేర్కొంది.
ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించే వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ చట్టాల అమలుకు సంబంధించి అన్ని గవర్నరేట్‌లలో అవేర్ నెస్ ప్రచారాలు నిరంతరం కొనసాగుతాయని జనరల్ ట్రాఫిక్ విభాగం తెలిపింది. డ్రైవర్లు చట్టాలను గౌరవించాలని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారుప. నిర్దేశిత పార్కింగ్ స్థలాల్లో మాత్రమే తమ వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







