బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- October 16, 2025
మనామా: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అక్టోబర్ 16–17 తేదీలలో ప్రవాస సంగమం కోసం బహ్రెయిన్లో పర్యటించనున్నారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆయన బహ్రెయిన్ లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా మలయాళం మిషన్ మరియు లోక కేరళ సభ సభ్యులు నిర్వహించే గ్రాండ్ ప్రవాసీ సంగమంలో పాల్గొంటారు. ఇది అక్టోబర్ 17న సాయంత్రం 6:30 గంటలకు బహ్రెయిన్ కేరళీయ సమాజం (BKS)లో జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయన్ ముఖ్య అతిథిగా పాల్గొని మలయాళీ ప్రవాస సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి భారత రాయబారి వినోద్ కె. జాకబ్, మంత్రి సాజి చెరియన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. జయతిలక్ మరియు పారిశ్రామికవేత్త ఎం.ఎ. యూసుఫ్ అలీ వంటి అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ పి.వి. రాధాకృష్ణ పిళ్లై మరియు జనరల్ కన్వీనర్ పి. శ్రీజిత్ ప్రకటించారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







