మూడు ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు

- June 22, 2025 , by Maagulf
మూడు ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు

అమెరికా: అణు అంశాల్లో ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌పై అమెరికా విజయవంతంగా దాడులు జరిపినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునే క్రమంలో జరిగిన ఈ దాడుల్లో ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాలుగా గుర్తింపు పొందిన B-2 Spirit స్టెల్త్ బాంబర్లు ఉపయోగించబడినట్టు అమెరికా అధికార వర్గాలు ధ్రువీకరించాయి. ఇరాన్ అణు కార్యక్రమానికి ఎంతో కీలకమైన ఫోర్డో కేంద్రం ధ్వంసం చేసినట్టు ట్రంప్ గొప్పగా ప్రకటించారు. అయితే, అమెరికా వినియోగించిన బీ-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ల ను మృత్యుదూతగా పేర్కొంటారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానంగా గుర్తింపు పొందిన ఒక్కో B-2 స్పిరిట్ నిర్మాణ ఖర్చు 2.1 బిలియన్ డాలర్లు. సోవియట్ పతనం తర్వాత నార్త్రోప్ గ్రూమన్ వీటిని తయారు చేసింది.

ఈ బాంబర్లు రీఫ్యూయల్ లేకుండా 6,000 నాటికల్ మైళ్ల (11,112 కిలోమీటర్లు) దూరం ప్రయాణించగలవు. అలాగే, అమెరికా మిస్సోరీ నుంచి లిబియా, అఫ్ఘనిస్థాన్, ఇరాన్ వరకు దాడులకు నేరుగా చేరగల సత్తా వీటి సొంతం. ఇద్దరు పైలట్లతో పనిచేసే వినూత్న కాపిటెన్-కో పైలట్ వ్యవస్థ ఇందులో ఉంది. అంతర్గత ఆయుధ విభాగాలు దీనికి మెరుగైన రక్షణ కల్పిస్తాయి. కాగా, అమెరికా దాడిని ఇరాన్ ధ్రువీకరించింది. ఫోర్డోపై కూడా దాడి జరిగినట్టు తెలిపింది.అత్యంత శక్తివంతమైన బాంబులను ప్రయోగించే బీ-2 స్పిరిట్ (B-2 Spirit) బరువు దాదాపు 14 టన్నులు. 200 అడుగుల (61 మీటర్లు) దూరంలో సురక్షిత కాంక్రీట్ పైభాగాన్ని కూడా విజయవంతంగా ఇవి ఛేదించగలవు. GPS ఆధారిత సాంకేతికతతో భూగర్భ అణు కేంద్రాలను ధ్వంసానికి ప్రత్యేకంగా వీటిని రూపొందించారు.

ఒక్క మిషన్‌లో ఒకటి లేదా రెండు మాత్రమే B-2లను వాడే అవకాశం ఉంటుంి. ఫోర్డో అణు కేంద్రంపై దాడిలో ఏకంగా 6 MOP బాంబులు వాడినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇరాన్‌ అణు కేంద్రాలపై దాడుల్లోనూ ఈ బాంబర్లు వర్షం కురిపించాయి.జాయింట్ డైరెక్ట్ అటాక్ మ్యునిటిషన్(JDAM), జీపీఎస్ (GPS) ఆధారిత గైడెడ్ బాంబులతో శత్రు లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు, ఒకేసారి అనేక లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం వీటికి అదనం. విమానం ప్రమాద పరిధిలోకి వెళ్లకుండానే లక్ష్యాన్ని చేధించగలదు. గ్లైడ్ టెక్నాలజీతో వ్యవస్థాపిత గమ్యం సామర్థ్యం. 800 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను చేరుకునే సత్తా వీటికి ఉండటం విశేషం.

16 B83 అణు బాంబులను కూడా ప్రయోగించేలా దీనిని రూపొందించారు. రాడార్‌లు గుర్తించేలోపు లక్ష్యాన్ని చేరుకుని వెనక్కి తిరిగి రాగలవు. ప్రపంచ అత్యాధునిక ఏఎంటీ వ్యవస్థలు కూడా దీనిని గుర్తించలేవు ఇరాన్ (Iran) వంటి దేశాల్లో అణు స్థావరాలు భూగర్భంలో రహస్యంగా ఉంటాయి.కానీ, B-2 స్పిరిట్ వాటిని కూడా ధ్వంసం చేయగలదని తాజాగా నిరూపితమయ్యింది. ఈ దాడులు అమెరికా సైనిక శక్తి ప్రదర్శన మాత్రమే కాదు, ఒక విధంగా అణు కార్యక్రమాలు దిశగా సాగుతోన్న దేశాలకు హెచ్చరిక కూడా.

ఈ దాడుల్లో ఫోర్డో అణుస్థావరం టార్గెట్ చేయబడింది.ఇరాన్‌కు ఈ కేంద్రం ఎంతో కీలకమైనదిగా పరిగణించబడుతుంది. ఇది భూగర్భంలో నిర్మించిన అణుశక్తి కేంద్రం. అయితే, అత్యంత రహస్యంగా B-2 బాంబర్లు మౌనంగా ప్రవేశించి దీన్ని ధ్వంసం చేశాయని సమాచారం.ట్రంప్ ఈ దాడిని తన పాలనలో తీసుకున్న ఓ విజయంగా అభివర్ణించారు.అమెరికా ప్రయోగించిన స్టెల్త్ బాంబర్లు యుద్ధ విమానాల చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి.ఇవి శత్రు రాడార్‌లను తప్పించుకునే విధంగా అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీతో రూపొందించబడ్డాయి. సుదూర ప్రాంతాలపై దాడులు చేయగల సామర్థ్యం ఉన్న ఈ బాంబర్లు, న్యూక్లియర్ లేదా కాన్వెన్షనల్ బాంబులను తీసుకెళ్లగలవు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com