ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్..
- June 22, 2025
ముంబై: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్ అయిన సంఘటన కలకలం రేపుతోంది.ఈ అక్రమ రవాణాలో మొత్తం 4.44 కిలోల బంగారంను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.ఈ కేసులో విమానాశ్రయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల హస్తం ఉన్నట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.
కస్టమ్స్ విభాగం తెలిపిన వివరాల ప్రకారం, బంగారాన్ని పౌడర్ రూపంలో మార్చి, అది గుర్తించకుండా సాక్సుల్లో దాచి తరలించేందుకు ప్రయత్నించారు. విమానాశ్రయంలో పనిచేస్తున్న ఉద్యోగులే బంగారం తరలించేందుకు సహకరిస్తున్నారని గుర్తించిన అధికారులు… ఇద్దరు ఉద్యోగులను అరెస్టు విచారిస్తున్నారు.
ఈ ముఠా వెనుక మరెంతమంది ఉన్నారనే దానిపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. విమానాశ్రయ సెక్యూరిటీతో పాటు ఇతర సంబంధిత ఏజెన్సీలతో కలిసి మిగతా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







