"బంతిపూల జానకి" కి యూ/ఎ" సర్టిఫికేట్..
- July 13, 2016
ఉజ్వల క్రియేషన్స్ పతాకం పై.. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో కల్యాణి-రాం నిర్మాతలుగా రూపొందిన చిత్రం "బంతిపూల జానకి". ధనరాజ్, దీక్షాపంత్ మరియు "జబర్దస్త్" టీమ్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని "యూ/ఎ" సర్టిఫికేట్ అందుకొంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు, సినిమా చాలా బాగుంది అని ప్రశంసించడంతోపాటు ఈమధ్య కాలంలో ఇలాంటి కామెడీ ఎంటర్ టైనర్ చూడలేదని, చాల చక్కగా సినిమాని తీర్చిదిద్దారని తెలిపినట్టు నిర్మాతలు తెలియజేశారు.ఇటీవల విడుదలైన థియేటర్ ట్రైలర్ కి అనూహ్య స్పందన లభిస్తోంది. త్వరలో ఆడియో ఫంక్షన్ నిర్వహించి, విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది. ధనరాజ్ నటించిన తాజా చిత్రం పనిలేని పులి రాజు జూలై 15న విడుదల కానున్న సంగతి తెలిసిందే. "బంతిపూల జానకి" చిత్రంలో.. అదుర్స్ రఘు, చమ్మక్ చంద్ర, షకలక శంకర్, వేణు, రాకెట్ రాఘవ, డా. భరత్ రెడ్డి, సుడిగాలి సుధీర్, జీవన్, అవినాష్, ఫణి, నాగి, కోమలి తదితరులు నటించారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







