కమల్ హాసన్ కు గాయాలు
- July 13, 2016
ప్రముఖ నటుడు కమల్ హాసన్ గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఆయన తన కార్యాలయంలో మెట్లు దిగుతూ జారి పడ్డారు. దీంతో ఆయన కాలికి గాయం అయ్యింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే కమల్ ను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే కమల్ కు ప్రమాదంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది. కమల్ ఇటీవలే శభాష్ నాయుడు షూటింగ్ షెడ్యూల్ ముగించుకొని చెన్నై చేరుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. కమల్ తొలిసారిగా తన కూతురు శృతిహాసన్ తో కలిసి నటిస్తున్న శభాష్ నాయుడు చిత్రం ప్రస్తుతం సెట్స్ ఉంది. ఈ చిత్రాన్ని కమల్ స్వయంగా డైరెక్ట్ చేస్తుండగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటిస్తోంది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







