తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
- June 26, 2025
సికింద్రాబాద్..తిరుమలగిరి ఆర్టిఏ (RTA)కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఉదయం నుండే ఏసీబీ అధికారులు పలు బృందాలుగా విడిపోయి తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయానికి చేరుకుని ఏజెంట్లు చేస్తున్న దందాను పసిగట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఏజెంట్ల పై పక్కా నిఘా ఉంచిన ఏసీబీ బృందాలు 20 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.ఏజెంట్ల నుండి నగదు, పలు వాహన ధ్రువీకరణ పత్రాలు, సెల్ ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లు దొరికాయని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.
ఏజెంట్ల ఫోన్లను స్వాధీనం చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు .ఆర్టీవో సిబ్బందిపై కూడా పలు ఆరోపణలు ఉన్న నేపధ్యంలో వారిని కూడా విచారిస్తామని అన్నారు. ఆర్టీవో ను కూడా అన్ని కోణాలలో విచారించి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఒక్కో ఏజెంట్ దగ్గర 50 వాహన దృవీకరణ పత్రాలు ఉన్నట్లు నిర్ధారణ అన్నకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రాత్రి వరకు ఏసీబీ సోదాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్