గల్ఫ్ దేశాలతో 'నమ్మకాన్ని' పునర్నిర్మించుకోవాలి..ఇరాన్‌కు యూఏఈ పిలుపు..!!
- June 29, 2025
యూఏఈః ఖతార్‌లోని అల్ ఉదీద్ సైనిక కేంద్రంపై టెహ్రాన్ మిస్సైల్స్ తో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇతర గల్ఫ్ దేశాలతో విశ్వాసాన్ని పునర్నిర్మించుకోవాలని యూఏఈ దౌత్యవేత్త అన్వర్ గర్గాష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ ప్రాంతంలోని దేశాలు ఇరాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా ఒక వైఖరిని తీసుకున్నాయని గుర్తుచేశారు. "పరిస్థితిని తగ్గించడానికి అన్ని అంతర్జాతీయ వేదికల ద్వారా పని చేస్తున్నాయని, అణు ఫైల్ వంటి అపరిష్కృత సమస్యల పరిష్కారానికి పిలుపునిచ్చాయని" అన్నారు.
అయినా, ఇరాన్ "సోదర దేశమైన ఖతార్ సార్వభౌమత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఇది మనందరినీ ప్రభావితం చేసే చర్య.టెహ్రాన్ తన గల్ఫ్ పొరుగు దేశాలతో విశ్వాసాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది." అని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!







