సౌదీ అరేబియాలో పన్ను జరిమానా మినహాయింపు.. 2025 చివరి వరకు పొడిగింపు..!!
- June 29, 2025
రియాద్: సౌదీ జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZTCA).. జూలై 1 నుండి ఆరు నెలల కాలానికి జరిమానాలను మాఫీ చేయడానికి, పన్ను చెల్లింపుదారులను జరిమానాల నుండి మినహాయింపు పొడిగించడానికి ఆర్థిక మంత్రి ఆమోదం తెలిపినట్లు ప్రకటించింది. ఈ పొడిగింపు అన్ని సౌదీ పన్ను చట్టాల ప్రకారం.. డిసెంబర్ 31 వరకు పన్ను చెల్లింపుదారులకు వర్తిస్తుంది. ఇది ఐటీ రిటర్నులను ఆలస్యంగా నమోదు చేయడం, ఆలస్యంగా చెల్లింపు చేయడం వంటి వాటికి సంబంధించిన జరిమానాల నుండి ఉపశమనం అందిస్తుందని అధికారులు తెలిపారు. విలువ ఆధారిత పన్ను (VAT) రిటర్న్‌లను సరిదిద్దడం, ఎలక్ట్రానిక్-ఇన్‌వాయిసింగ్ నిబంధనలకు సంబంధించిన క్షేత్ర ఉల్లంఘనలకు జరిమానాలు, సాధారణ VAT-సంబంధిత ఉల్లంఘనలకు కూడా ఇది మినహాయింపు ఇస్తుందన్నారు.
అయితే, పన్ను ఎగవేత ఉల్లంఘనలకు జరిమానాలు, ఈ చొరవ అమలులోకి వచ్చే తేదీకి ముందు చెల్లించిన జరిమానాలు లేదా జూన్ 30 తర్వాత చెల్లించాల్సిన రిటర్న్‌లకు సంబంధించిన జరిమానాలను ఇది కవర్ చేయదని ZTAC తెలిపింది.
ZTAC అన్ని పన్ను చెల్లింపుదారులు గ్రేస్ పీరియడ్‌ను ఉపయోగించుకోవాలని కోరింది. 24/7 అందుబాటులో ఉన్న యూనిఫైడ్ కాల్ సెంటర్ నంబర్ 19993 లేదా X Zatca_Care ప్లాట్‌ఫారమ్‌లోని "ఆస్క్ జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్" ఖాతా లేదా [email protected] ఇమెయిల్ లేదా అధికార వెబ్‌సైట్‌లోని లైవ్ చాట్ ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్