పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ దాడులను ఖండించిన సౌదీ అరేబియా..!!
- June 29, 2025
రియాద్: ఇజ్రాయెల్ దళాలు పాలస్తీనా పౌరులపై కొనసాగిస్తున్న హింసను సౌదీ అరేబియా ఖండించింది. వెస్ట్ బ్యాంక్‌లోని రామల్లా తూర్పున ఉన్న కాఫర్ మాలిక్ గ్రామంలో ఇటీవల జరిగిన దాడులను మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది.
గాజాలో నిరాయుధ పౌరులపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దమకకాండను, నిరాశ్రయులకు నివాసంగా ఉన్న పౌర స్థలాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. పాలస్తీనా పౌరులకు రక్షణ కల్పించడానికి, వారి చట్టబద్ధమైన హక్కులన్నింటినీ వినియోగించుకోవడానికి వీలు కల్పించడానికి అన్ని ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉందని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను ఇజ్రాయెల్ ఉల్లంఘించడాన్ని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాలని మరోసారి పిలుపునిచ్చింది.
బుధవారం సాయంత్రం దాదాపు 100 మంది ఇజ్రాయెల్ వలసదారులు గ్రామంపై దాడి చేసి ముగ్గురు పాలస్తీనియన్లను కాల్చి చంపారు. కాఫర్ మాలిక్ వాసులు రక్షణ కోసం, వారిని వెనక్కి తరిమికొట్టే ప్రయత్నంలో రాళ్ళు విసిరారు. కానీ, వారికి తోడుగా వచ్చిన ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనియన్లపై కాల్పులు జరిపింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!