షార్లెట్‌లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- February 10, 2026
అమెరికా: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ షార్లెట్‌లో చదరంగపోటీలు నిర్వహించింది. షార్లెట్ నాట్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన చదరంగం టోర్నమెంట్ అత్యంత ఉత్సాహభరితంగా సాగింది..స్థానిక చిన్నారులు,పెద్దల మేధస్సుకు పదును పెడుతూ నిర్వహించిన ఈ క్రీడా సంబరంలో 50 మందికి పైగా చెస్ ప్లేయర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. మూడు విభాగాలుగా నిర్వహించిన ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలలో ప్రతి విభాగం నుండి ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విజేతలకు బహుమతులను అందజేశారు. తెలుగు వారిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నాట్స్ తీసుకుంటున్న రవను స్థానికులు అభినందించారు. గెలుపోటముల కంటే కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడం, కొత్త విషయాలను నేర్చుకోవడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని నాట్స్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమం ఇంతటి ఘనవిజయం సాధించేందుకు సహకరించిన వాలంటీర్లకు, తల్లిదండ్రులకు నాట్స్ షార్లెట్ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..నాట్స్ చదరంగ పోటీలను విజయవంతం చేసిన నాట్స్ షార్లెట్ టీంని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందించారు.
షార్లెట్ నాట్స్ చదరంగం పోటీల్లో విజేతల వివరాలు ఇవి.
అన్ రేటేడ్
1)బొడ్డుకూరి దేవాన్ష్
2) రావల్ శాశ్వత్
3)మోరంపూడి శర్వ విహాన్
700 కంటే తక్కువ రేట్ వర్గం
1)నంబూరి విహాన్
2)శ్రీవత్స అనవి
3) దండు నిహాల్
700 కంటే ఎక్కువ రేట్ వర్గం
1)నంబూరి అనిల్ కుకర్
2)మల్లికార్జున అద్వైత్
3)అభిషక కేశవ్
తాజా వార్తలు
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్‌న్యూస్
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌కు కొత్త అద్దె సూచిక.. కొత్త చట్టంతో పారదర్శకతకు ప్రాధాన్యం
- కువైట్‌లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్‌లో అల్ అమెరికాత్ ఓవర్‌పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే







