లోక్‌సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- February 10, 2026
న్యూ ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు లోక్‌సభ జనరల్ సెక్రటరీకి నోటీసులు ఇచ్చినట్లు కాంగ్రెస్ లోక్‌సభ ఉపపక్షనేత గౌరవ్ గోగాయ్ తెలిపారు. అవిశ్వాస తీర్మాణానికి మద్దతుగా 100కి పైగా ఎంపీల సంతకాలు సేకరించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకపోవడంపై విపక్షాలు ఆగ్రహంతో ఉన్నాయి. మహిళా MPల పేర్లు ప్రస్తావించడంపైనస 8మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడంపైన కూడా అసంతృప్తితో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు సమాచారం. అధికారపక్ష ఎంపీలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నట్లుగా స్పీకర్ వైఖరి ఉందని విపక్షం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్‌ను తొలిగించాలని అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







