చైనా, తైవాన్ లకు షాకిచ్చిన సౌదీ అరేబియా..!!

- June 30, 2025 , by Maagulf
చైనా, తైవాన్ లకు షాకిచ్చిన సౌదీ అరేబియా..!!

రియాద్: చైనా, తైవాన్ నుండి దిగుమతయ్యే స్టెయిన్‌లెస్ స్టీల్ పైపులపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు సౌదీ వాణిజ్య మంత్రి, జనరల్ అథారిటీ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (GAFT) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ డాక్టర్ మజేద్ అల్-కసాబి తెలిపారు.  ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

జూన్ 30  నుండి ఐదు సంవత్సరాల పాటు ఇది అమల్లో ఉంటుందన్నారు. ఆయా ఉత్పత్తుల దిగుమతులపై 6.5 శాతం నుండి 27.3 శాతం వరకు ఫైనల్ యాంటీ-డంపింగ్ సుంకాలను విధించి వసూలు చేయాలని జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీని మంత్రి అల్-కసాబి ఆదేశించారు.

స్థానిక పరిశ్రమను రక్షించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్య నివారణల చట్టం ప్రకారం.. తుది డంపింగ్ వ్యతిరేక సుంకాలను నిర్ణయించినట్లు వెల్లడించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com