అబుదాబిలోని ఈ బీచుల్లో స్విమ్మింగ్ చేయడం ప్రమాదకరం..!!

- June 30, 2025 , by Maagulf
అబుదాబిలోని ఈ బీచుల్లో స్విమ్మింగ్ చేయడం ప్రమాదకరం..!!

యూఏఈ: అబుదాబిలోని నివాసితులు, సందర్శకులు తీరప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలలో స్విమ్మింగ్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. అల్ బహియా సముద్రం నుండి అల్ షాలిలా ప్రాంతం వరకు విస్తరించి ఉన్న నిషేధిత తీర ప్రాంతాలలో ఈతకు దూరంగా ఉండాలని మునిసిపాలిటీలు, రవాణా శాఖతో పాటు అధికారులు ప్రజలను కోరారని తెలిపారు.

ఆలల తీవ్రత అధికంగా ఉండటంతోపాటు నీటి అడుగున అడ్డంకులు ఉండటం వంటి అనేక కారణాల వల్ల, రెస్క్యూ బృందాలు లేకపోవడంతో పాటు ఈ ప్రదేశాలు ప్రజా భద్రతకు ప్రమాదకరంగా మారవచ్చని తెలిపారు. ఈత కొట్టడం వల్ల మునిగిపోవడం లేదా గాయపడే అవకాశాలు ఉంటాయని అధికారులు హెచ్చరించినందున, ఈత కొట్టకుండా చూసుకోవడానికి ఈ ప్రాంతాలలో స్పష్టమైన హెచ్చరిక బోర్డులను పెట్టినట్టు తెలిపారు.    

ఈ ప్రాంతాల్లో పిల్లలు ఈత కొట్టకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  కుటుంబాలు తమ పిల్లలను రక్షణకు లైఫ్‌గార్డ్ స్టేషన్లు అందుబాటులో ఉన్న నియమిత ప్రాంతాలలో మాత్రమే ఈత కొట్టించాలని సూచించారు. 

గత సంవత్సరం, దుబాయ్‌లోని అల్ మమ్జార్ బీచ్ నుండి ఈత కొడుతుండగా బలమైన ఆలలలో చిక్కుకుని 15 ఏళ్ల భారతీయ ప్రవాసి మునిగిపోయాడు. 2022లో, అబుదాబిలోని ఒక దీవుల బీచ్‌లో 31 ఏళ్ల వ్యక్తి ఈత కొడుతుండగా మునిగిపోయి మరణించాడు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com