బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. భారతి ఎయిర్టెల్ స్కాలర్షిప్ స్కీం..
- July 01, 2025
ఇంటర్ చదవబోతున్న విధ్యార్థులకు నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వారికి భారతి ఎయిర్టెల్ ఫౌండేషన్ సంస్థ “భారతి ఎయిర్టెల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025–26″ ద్వారా స్కాలర్షిప్ అందిస్తోంది. భవిష్యత్తులో టెక్నాలజీ రంగంలో ప్రతిభావంతులను తయారుచేసేందుకే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు సంస్థ అధికారులు తెలిపారు. ఈ స్కీం లో భాగంగా విద్యార్థులకు ఫుల్ ఫీజ్, ఫ్రీ లాప్ టాప్, హాస్టల్ ఫెసిలిటీ, టీషన్ ఫీ ఇలా చాలా రకాల ప్రయోజనాలు అందనున్నాయి. కాబట్టి, ప్రతీ ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ అధికారులు సూచించారు. దరఖాస్తు ఇప్పటికే మొదలవగా 31 జూలై 2025తో ముగియనుంది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
అర్హత:
2025‑26 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం UG/ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశం కలిగి ఉండాలి. అది కూడా ఇలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, టెలికాం, ఐటీ, సీఎస్, డేటా సైన్స్, ఎయిరో స్పేస్, AI/IoT/AR‑VR/Machine Learning/Robotics మొదలైన కోర్సుల వారు మాత్రమే దీనికి అర్హులు.
భారతీయ పౌరుడు అయ్యి ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం ₹8.5 లక్షలకు మించి కాకూడదు
- ఒకే కోర్సుకు ఇతర స్కాలర్షిప్లు కలిగి ఉండకూడదు.
- ఈ స్కాలర్షిప్ ప్రయోజనాలు:
- ఫీజుల కవరీ: 5 సంవత్సరాల విధ్యా కాలానికి ఏడాది వారీగా 100% ట్యూషన్ ఫీజు అందిస్తారు.
హోస్టల్ & మెస్ ఫీజులు: యూనివర్సిటీ/కాలేజ్ హోస్టల్స్ ఆశిస్తే పూర్తి కవర్, లేదా ప్రైవేట్ పీజీ/హోస్టల్ ఉంటే యూనివర్సిటీ చార్జిల ఆధారంగా ఫీజులు చెల్లిస్తారు.
ల్యాప్‌టాప్: మొదటి సంవత్సరంలోనే లాప్ టాప్ అందిస్తారు.
కావలసిన ధ్రువపత్రములు:
ఆధార్ కార్డు, మార్క్‌షీట్, JEE/Entrance స్కోర్ కార్డ్, అడ్మిషన్ లెటర్, ఫీజు స్ట్రక్చర్, Income సర్టిఫికెట్, బ్యాంక్ స్టేట్మెంట్, SOP, PG/rent receipts (if applicable), ఫోటో.
అప్లికేషన్ విధానం: అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://bhartifoundation.org/ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!